నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని కొండమీద కొండూరు గ్రామంలో తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతుంది. నివర్ తాకిడికి కొండమీద కొండూరు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆరు రోజుల నుంచి ఆ గ్రామానికి మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉద్ధృతికి నీటిలో మునిగి 800 ఎకరాల్లో నారు పూర్తిగా కుళ్లిపోయింది. నష్టపోయిన తమని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి