ETV Bharat / state

కొండాయపాళెంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన కలెక్టర్ - కొండాయపాళెంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన కలెక్టర్

నెల్లూరు జిల్లా కొండాయపాళెంలో నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్​ను కలెక్టర్ చక్రధర్ బాబు ప్రారంభించారు. సుమారు రూ. 2.70 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు

nellore
కొండాయపాళెంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన కలెక్టర్
author img

By

Published : Aug 3, 2020, 6:33 PM IST

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాళెం దగ్గర 2.70 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్​ను కలెక్టర్ చక్రధర్ బాబు ప్రారంభించారు. దీనివల్ల కొండాయపాళెం, ఇస్కాన్ సిటీ, ఇందిరా నగర్, కావేరీ నగర్, బ్యాంక్ కాలనీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లాలో రూ.2వేల కోట్ల విద్యుత్ రంగ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి ఘనంగా శ్రీ కామాక్షిసమేత సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.