మహిళల భద్రతే ధ్యేయంగా పనిచేస్తున్నామని నెల్లూరు ఎస్పీ భాస్కర్‌భూషణ్ పేర్కొన్నారు. దిశ మహిళా పోలీసు స్టేషన్‌కు మంజూరైన 45 ద్విచక్ర వాహనాలు, 2 తుపాన్ వాహనాలు, 1 టెంపో వాహనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ వాహనాలతో మహిళలకు రక్షణ కలుగుతుందని ఎస్పీ అన్నారు. మహిళలు తక్షణ సాయం కోసం డయల్ 100, ఎమర్జెన్సీ 112, 181, దిశ ఎస్‌ఓఎస్ యాప్‌ను నొక్కాలన్నారు.
అనంతరం మహిళా పోలీసు స్టేషన్ నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటరత్నం, దిశ మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ నాగరాజు, ఎంటీవో శ్రీకాంత్, దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బడ్జెట్: మూడు నెలలకు రూ. 86 వేల కోట్లు !