పల్లెల్లో పంచాయతీ పోరు మెుదలైంది. మెుదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. పలు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలుపుకోసం వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మెజార్టీ పంచాయతీలు దక్కించుకోవటమే లక్ష్యంగా అధికార వైకాపా పావులు కదుపుతోంది. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనేతలు మేకపాటి నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రెబెల్స్‌ను ఉపసంహరించటం తదితర అంశాలపై చర్చించారు.
సమావేశంలో మంత్రులు, బాలినేని, అనిల్, మేకపాటి, ప్రభుత్వ సలహాదారు సజ్జల, జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఇదీచదవండి: పల్లెపోరు: రేపట్నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరణ