సీఎం జగన్.. రేషన్ డీలర్లను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని నెల్లూరు జిల్లా చౌక ధరల దుకాణదారుల సంక్షేమ సంఘం కోరింది. ప్రభుత్వం చేపట్టనున్న గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకంపై సంఘ ప్రతినిధుల సమావేశంలో చర్చించారు. రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తారంటూ వస్తోన్న వదంతులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ అన్నారు. చాలీచాలని కమీషన్లలతో జీవితాలు నెట్టుకొస్తోన్న తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నారు. ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకుంటే... న్యాయపోరాటం చేస్తామన్నారు.
ఇదీ చదవండి : జులై 1 నుంచి రైల్వే నూతన కాల పట్టిక