ETV Bharat / state

Notice To Anandaiah: 'మందు పంపిణీకి ఉన్న అనుమతులు తెలపండి'.. ఆనందయ్యకు జేసీ నోటీసులు - ఆనందయ్య ఒమిక్రాన్ మందు

JC Notice To Anandaiah: ఒమిక్రాన్ మందు పంపిణీకి ఉన్న అనుమతులు తెలపాలని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు నెల్లూరు జాయింట్ కలెక్టర్ గణేశ్ కుమార్ నోటీసులు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

'మందు పంపిణీకి ఉన్న అనుమతులు తెలపండి'
'మందు పంపిణీకి ఉన్న అనుమతులు తెలపండి'
author img

By

Published : Dec 28, 2021, 9:11 PM IST

JC Notice To Anandaiah: ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు నెల్లూరు జాయింట్ కలెక్టర్ గణేశ్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్ మందు పంపిణీకి ఉన్న అనుమతులు తెలపాలని ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా మందు పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు ఆనందయ్యకు వ్యతిరేకంగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆనందయ్య మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది.

ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థుల ఆందోళన

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో..ఆనందయ్య ఇంటి వద్ద నిన్న గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్​కు మందు తయారీ ప్రకటనపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ మందు శాస్త్రీయతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒమిక్రాన్ మందుపై అనందయ్య ప్రకటనతో అనేకమంది వ్యాధిగ్రస్థులు గ్రామానికి వస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో నివేదికలు లేకుండా మందు తయారు చేసినట్లు ప్రకటించటం సరికాదన్నారు. వివిధ రకాల వ్యాధిగ్రస్థులు గ్రామంలోకి వస్తుండటంతో తమకూ వ్యాధులు సంక్రమిస్తాయనే ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

PROTEST AT ANANDAIAH HOUSE : ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.