నెల్లూరు జనసేన నేతలు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం... కరోనా కష్టకాలంలో పోలీసుల రక్షణ మద్య మద్యం అమ్మాల్సిన అవసరం ఏమెుచ్చిందని నిలదీశారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా అమ్మకాలు సాగిస్తున్న మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. వివాహాలకు 20 మందినే అనుమతిస్తున్న ప్రభుత్వం... మద్యం దుకాణాల వద్ద మందల మంది చేరుతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాలను మూయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జనసేన నేత కిషోర్ డిమాండ్ చేశారు. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు భౌతిక దూరం పాటించాలని సూచించేలా... పెయింటింగ్ వేశారు. అనంతరం నేతలు మాస్కులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందింది: భాజపా ముదిరాజ్ సెల్ రాష్ట్ర కార్యదర్శి