నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో డీఆర్‌సీ సమావేశం రసాభాసగా జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. కోపోద్రిక్తులైన మంత్రి బాలినేని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మాణం చేసేవారికి 2 నెలలుగా బిల్లులు ఇవ్వలేదు ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. రెండో విడత భవనాలు ప్రారంభించాలని ఒత్తిడి చేయవద్దని కోరారు. అలాగే మంత్రులు నిధుల మంజూరులో శ్రద్ధ వహించాలని.. వెంకటగిరి నియోజకవర్గంలోనే గుత్తేదారులకు రూ.12 కోట్లు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రులు ఎమ్మెల్యేలకు హామీ ఇస్తున్నారు.
ఇదీ చూడండి: