నెల్లూరు జిల్లా పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లాలోని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు విష్ణు, నరేశ్‌లు.. ఓ యాచకుడికి స్నానం చేయించి నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం అతనికి ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసుల మానవత్వాన్ని అభినందించిన నెటిజన్లు, పోలీసు ఉన్నతాధికారులు.. వారిపై ప్రశంసల జల్లు కురింపించారు.
ఇదీ చదవండి: