నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు ప్రాంతంలో నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న హోటల్స్, బేకరీ, స్వీట్ షాపులపై కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. కార్పొరేషన్ వైద్యాధికారి వెంకట రమణ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. అలేఖ్య బేకరీలో ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేశారు. కరోనా కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మకాలు సాగించాలని, నిల్వ ఉంచిన, చెడిపోయిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఇది చదవండి ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు