Nakkagopalnagar people slept at Collectorate: నెల్లూరు జిల్లాలోని నక్కా గోపాల్‌నగర్ వాసులు.. నిన్నటి నుంచి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ..పిల్లలతో కలిసి రాత్రి అక్కడే పడుకొని నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇళ్లు కట్టించి ఇచ్చేవరకు ఆందోళన ఆపేది లేదని చెబుతున్నారు. అయిదేళ్లుగా రియల్టర్ల నుంచి ఇబ్బందులు పడుతున్నా.. తమవైపు ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పని చేసి సంపాదించుకున్న డబ్బుతో గుడిసెలు వేసుకుంటే.. వాటిని కూల్చేశారని వాపోయారు. అలాగే తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది..
ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న తమపై కొందరు దౌర్జన్యం చేస్తున్నారని నక్క గోపాల్‌నగర్ వాసులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అయిదేళ్లుగా.. రియల్టర్ల నుంచి ఇబ్బందులు పడుతున్నా.. తమవైపు ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పని చేసి సంపాదించుకున్న డబ్బుతో గుడిసెలు వేసుకుంటే.. వాటిని కూల్చేస్తున్నారని వాపోయారు. రౌడీలతో తమపై దాడి చేయించటమే కాకుండా.. తమకు మద్దతుగా ఉన్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు ఆశిక్‌ను హతమార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని.. బాధితులు జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌ను కాళ్లపై పడి వేడుకున్నారు.
ఇదీ చూడండి: