నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో ఛైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశం(Naidupeta Municipality Meeting).. రసాభాసగా సాగింది. సమావేశంలో సభ్యులు.. ప్రజా సమస్యలపై గళమెత్తారు. వైస్ ఛైర్మన్ షేక్ రఫీ, కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డిల మధ్య చాలాసేపు వాదన జరిగింది.
కొన్ని నెలలుగా అభివృద్ధి పనులు సాగడంలేదని.. టీ, బిస్కెట్లు తినేందుకు సమావేశాలకు వచ్చినట్లుగా ఉందని షేక్ రఫీ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు.. వాళ్లకు అవసరమైన వాటికి బిల్లులు చేసుకుంటున్నారని, ప్యాచ్ వర్కులకు మాత్రం సీఎఫ్ఎంఎస్ ఖాతా నుంచి నిధులు రావడంలేదని చెబుతున్నారని అన్నారు. పట్టణంలో ఎలాంటి అభివృద్ధి పనులూ జరగట్లేదని.. స్థానికంగా కౌన్సిలర్లు తిరగలేకపోతున్నారని ఆయన వాపోయారు.
వీధి దీపాలు వెలగడం లేదని, దోమల మందు పిచికారీ చేయట్లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అవసరం లేనిచోట అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారని సభ్యులు అరోపించారు.
ఇదీ చదవండి..
Farmers Maha Padayatra: అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి