నెల్లూరు జిల్లా ఆత్మకూరు పుర పాలక సంఘానికి సంబంధించిన ఎన్నికల ఏర్పాట్ల పై మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ కార్యాలయంలో పలువురు అధికారులు పాల్గొని ఏర్పాటపై కమిషనర్‌కు వివరించారు. వార్డుల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా.. బెదిరిపులకు భయపడక ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు.
ఇవీ చూడండి...