రోజురోజుకు దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అధికమవుతున్నాయని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(mla nallapureddy prasannakumar reddy on rape cases) ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో జరిగిన ఆసరా పథకం రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేసే చట్టాలు రావాలని ఎమ్మెల్యే నల్లపురెడ్డి(mla nallapureddy on disha act) సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే మృగాళ్లలో భయం ఏర్పడుతుందన్నారు. ఈ మేరకు చట్టాల్లో మార్పులు తీసుకురావాలంటూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన దిశ చట్టం ద్వారా కొంతవరకు మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు.
ఇదీ చదవండి..
KRMB meeting: 'అనధికారికంగా విద్యుదుత్పత్తి చేయకూడదని చెప్పాం'