ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మొదటి ఏడాదే నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను సీఎం నిరాటంకంగా కొనసాగిస్తుంటే, ప్రతిపక్షం మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయన నెల్లూరులో దుయ్యబట్టారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే... తొలి రోజు నల్ల చొక్కాతో నిరసన తెలిపిన చంద్రబాబు.... రెండో రోజు సమావేశాలు డుమ్మా కొట్టారని విమర్శించారు. శాసనమండలి సమావేశాల్లో మాత్రం అభివృద్ధి బిల్లులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేస్తే కులం కార్డు చూపటం దారుణమన్నారు. కొన్ని పరిస్థితులు కారణంగా... కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన అది పార్టీపై గాని, పాలనపై గాని వ్యతిరేకత కాదన్నారు.
ఇవీ చదవండి: నాకు ప్రాణహాని ఉంది: లోక్‌సభ స్పీకర్‌కు రఘురామకృష్ణరాజు లేఖ