నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆత్మకూరులో పర్యటించారు. గౌతంరెడ్డి నియోజకవర్గంలోని ఏఎస్ పేట మండలంలో కార్యకర్తలు మేళతాళాలతో స్వాగతం పలికారు. శ్రీ కాజా నాయబ్ రసూల్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆత్మకూరులో ర్యాలీ నిర్వహించారు. స్థానిక రవితేజ కల్యాణ మండపంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉందని రాబోయే రోజుల్లో జలాశయం నుంచి ఉత్తర కాలువ పనులు పూర్తిచేసి చివరి ఆయకట్ట వరకు సాగునీరు అందేలాగా కృషి చేస్తానని తెలిపారు. వెనుకబడిన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ఎస్ పేట గ్రామంలో గురుకుల పాఠశాల మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదీ చదవండీ :