నెల్లూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు. సంగం మండలంలోని కోలగట్ల, ఏఎస్ పేట మండలంలోని హసనాపురం ప్రజలతో ఆయన మాట్లాడారు. కోలగట్లలోని పునరావాస కేంద్రాలకు వెళ్లి ముంపు బాధితులకు అందుతున్న భోజన వసతిపై ఆరా తీశారు. బాధితులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
అనంతరం సంగం బ్యారేజీ తాజా పరిణామాలపై అధికారులతో సమీక్ష జరిపారు. బ్యారేజీ వద్ద ఉన్న పొర్లు కట్ట నుంచి వరద వచ్చి ఎస్సీ, ఎస్టీ కాలనీలను ముంచెత్తుతోందని స్థానికులు మంత్రికి విన్నవించారు. యుద్ధప్రాతిపదికన పొర్లుకట్టకు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులోనూ తుపానులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రాణ నష్టం కలగకుండా నిరంతరం కృషి చేస్తున్న పోలీసులు, అధికారులను మేకపాటి అభినందించారు. మరిన్ని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: