నెల్లూరు నగరంలో ఉన్న ఆత్మకూరు బస్టాండ్‌ను కోవూరు తరలించేందుకు మంత్రి అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రధాన కూడలిలో ఉన్న బస్టాండ్‌ను నగరానికి సమీపంలో కోవూరు ప్రాంతంలో అభివృద్ది చేయాలని అధికారులను కోరారు. కోవూరులో మూడు ఎకరాల స్థలం పరిశీలించి అందులో బస్టాండ్‌ను నిర్మించాలని ఆర్టీసీ అధికారులకు ప్రణాళికను వివరించారు. కోవూరు సమీపంలోని చక్కెర పరిశ్రమ స్థలం కూడా అధికారులు పరిశీలనలో ఉంది. మూడు ఎకరాల్లో పెద్ద ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: వివాహితపై వాలంటీర్ అత్యాచారయత్నం