వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. 'తొలి యేడు-జగనన్న తోడు' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంవత్సరకాలంలో రైతులకు ప్రభుత్వం చేసిన మేలును అధికారులు మంత్రికి తెలిపారు.
వచ్చే నాలుగేళ్లలో రైతులకు ఏం చేయబోతున్నారో కూడా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ...రైతుల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుదన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు.