నెల్లూరు నగరాన్ని రానున్న మూడేళ్లలో అన్ని విధాల అభివృద్ధి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. మొదటి ఏడాదే నగరంలో దాదాపు 220 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. నగరంలోని మన్సూర్ నగర్, ఖుద్దూస్‌నగర్, బారకాసు సెంటర్, వాహబ్ పేట ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రామలింగాపురం ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను పది రోజుల్లో మొదలు పెట్టి, సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. కాలువల ఆధునికీకరణ పనులను చేపడతామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి..: ఉషారాణిని పరామర్శించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి