ETV Bharat / state

కరోనా బాధితురాలిని పట్టించుకోని వైద్య సిబ్బందిపై మంత్రి అనిల్​ ఆగ్రహం - today Minister Anil Kumar Yadav fire on covid hospital team news update

జీజీహెచ్​ కొవిడ్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. వైద్యాధికారులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితుల అవస్థలు ప్రత్యక్షంగా చూసిన ఆయన వైద్యాధికారుల తీరుపై మండిపడ్డారు.

Minister Anil Kumar Yadav visite ggh covid center
జీజీహెచ్​లో మంత్రి ఆకస్మిక తనిఖీ
author img

By

Published : Apr 25, 2021, 2:07 PM IST

జీజీహెచ్​లో మంత్రి ఆకస్మిక తనిఖీ

నెల్లూరు జిల్లా ప్రభుత్వ కొవిడ్ కేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బంది తీరుపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్​ కొవిడ్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. కరోనా బాధితులతో మాట్లాడారు. ఆసుపత్రిలో చేర్చుకోవాలంటూ ఉదయం 6 గంటల నుంచి ప్రాధేయపడుతున్న కరోనా బాధితురాలిని పట్టించుకోకపోవటంపై.. తీవ్రంగా మండిపడ్డారు. రోగుల అవస్థలపై ఎందుకు స్పందించటం లేదని.. వైద్యాధికారులు, సిబ్బందిని నిలదీశారు.

వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా బాధితులకు అవసరమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.

ఇవీ చూడండి...

అయిదేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.