నెల్లూరు నగరంలోని బోడిగాడితోటలో శ్మశానవాటిక నిర్మాణ పనులను రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. రెండు కోట్ల రూపాయల వ్యయంతో శ్మశానవాటిక నిర్మాణ పనులు సాగుతున్నాయి.
పనుల వివరాలను.. మంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేసి, శ్మశానవాటికను అందుబాటులోకి తీసుకురావాలని వారికి మంత్రి సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ మంత్రి వెంట ఉన్నారు.
ఇదీ చదవండి:
మెజిస్ట్రేట్ ఉత్తర్వులనూ పట్టించుకోరా.. సీఐడీపై హైకోర్టు ఆగ్రహం