నెల్లూరు జిల్లా కండలేరు డ్యామ్ చరిత్రలో రికార్డు స్థాయిలో 53 టీఎంసీల నీటిని నిల్వ చేయడం ఇదే ప్రథమమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కండలేరు రిజర్వాయర్ ను మంత్రి సందర్శించారు. ఇంకా 60 టీఎంసీల సామర్థ్యంతో నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సేవను సరిహద్దులు దాటించిన తెలుగు తేజాలు.!