పౌర సరఫరాల శాఖ అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను వంచిస్తున్నారని నెల్లూరు జిల్లా రైతు సంఘాల ఐక్య వేదిక మండిపడింది. రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు సాధారణ రకం అంటూ తరుగులు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తీసుకెళ్తే మూడు నాలుగు రోజులపాటు కొనకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహించారు. అన్నీ తెలిసి కూడా కలెక్టర్ పట్టించుకోవడం లేదని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. తక్షణమే రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి