నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లో వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న వలస కూలీలు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సుమారు 130 మంది వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు 20 రోజుల క్రితమే నమోదు చేసుకొని కరోనా పరీక్షలు కూడా పూర్తి చేశారు.
కానీ... వారిని ఎప్పుడు తరలిస్తారన్నది అధికారులకూ స్పష్టత లేకుండా పోయింది. వలస కూలీలు గత 20 రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సొంత రాష్ట్రాలకు తమల్ని పంపాలని ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులను వేడుకొంటున్నారు. అధికారులు మాత్రం మాకు ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. పైనుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి: