ETV Bharat / state

మతిస్థిమితం సరిగా లేని యువతి.. 2 నెలలుగా బంధించిన వ్యక్తి

Man kept Young Woman Captive for 2 Months: వేగంగా పరిగెడుతున్న కాలంలో పరిచయం లేని వ్యక్తిని పలకరించడానికి ఆలోచిస్తాం. కానీ నెల్లూరు జిల్లాలో మతిస్థిమితం సరిగా లేని యువతిని ఒకతను తన గదిలో బంధించాడు. అతను ఎందుకు అలా చేశాడనేది విచారిస్తామని పోలీసులు తెలిపారు.

Mentally Challenged Girl
Mentally Challenged Girl
author img

By

Published : Jan 6, 2023, 9:49 PM IST

Man kept Young Woman Captive for 2 Months: మతిస్థిమితం సరిగ్గా లేని యువతిని.. ఓ వ్యక్తి రెండు నెలలుగా ఇంట్లో నిర్బంధించిన ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగింది. లంకేశ్వరుడు అనే వ్యక్తి తనతో సంబంధం లేని యువతిని ఇంట్లోనే బంధించాడు. యువతిని బంధించడాన్ని గమనించిన స్థానికులు.. ఐసీడీఎస్, పోలీసు అధికారులకు సమాచారమివ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆత్మకూరు మండలానికి చెందిన ఓ యువతి కొడవలూరు మండలం యల్లాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తోందని సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు యువతిని రక్షించి, వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.