ETV Bharat / state

8 నెలల తర్వాత.. కల్యాణ వేదికల్లో మళ్లీ సందడి - నెల్లూరులో ఉపాధి వార్తలు

కరోనా తర్వాత పెళ్లి కళ మళ్లీ మొదలవుతోంది. ఆ దిశగా కల్యాణ వేదికలు సిద్ధం అవుతున్నాయి. పరిమిత సంఖ్యలో వేడుకలు చేయడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఈనెల మధ్యలో పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనుమతులు కోసం అటు రెవెన్యూ, ఇటు పోలీస్‌ శాఖలకు కొందరు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో అటు మండపాలతోపాటు అనుబంధ రంగాల్లో ఉపాధి మళ్లీ దొరుకుతుందన్న ఆశ మొదలైంది. దాదాపుగా ఎనిమిది నెలల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్మికులు, వ్యాపారులు, మండపాల నిర్వాహకులు కొందరు బ్యాంకులకు కంతులు కట్టలేని దుస్థితులు కన్పించాయి. తాజా పరిస్థితుల్లో కోటి ఆశలతో ముందుకు కదులుతున్నారు.

marriage venues
కల్యాణ వేదిక
author img

By

Published : Oct 17, 2020, 6:50 PM IST

కరోనా కారణంగా లాక్​డౌన్ వల్ల కల్యాణవేదికలుమూగబోయిన..ఇప్పుడు కొన్ని వేడుకలకు సిద్ధం కానున్నాయి. కార్తీకమాసంలో పెళ్లిల్ల సీజన్ మొదలుకావడంతో...షాపింగ్ మాల్​లు, అభరణాల దుకాణాలు కళకళలాడనున్నాయి.

నెల్లూరు జిల్లా గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో కల్యాణవేదికలు సుమారుగా 90 వరకు ఉన్నాయి. అటు తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపాలతో పాటు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నవి ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా కొందరు ఇళ్ల దగ్గరే సెట్టింగ్స్‌ వేసి పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇలా సీజన్లల్లో పెళ్లి వేడుక స్థాయిని బట్టి రూ. 5 లక్షల నుంచి రూ. కోట్ల వరకు వ్యయం చేస్తుంటారు. ఇలా ఏటా రూ. కోట్లలో వ్యాపారం సాగుతోంది. దీంతో అటు కొందరికి ఉపాధి మార్గంగా పొట్ట నింపుతోంది. పెళ్లిళ్లు సాగడం ద్వారా బట్టల దుకాణాలు, బంగారు ఆభరణాలు, వసతి, ఆతిథ్యం, డెకరేషన్, మంగళవాయిద్యం ఇలా అనేక రంగాలు ఇందులో ముడిపడి ఉంటం వల్ల ఈ రంగం ఎనిమిది నెలలుగా కుదేలైంది.
ఆశ్వయుజమాసం ఆరంభంతో పెళ్లిలు చేసుకోవడానికి ప్రజలు అడుగులు వేస్తున్నారు. ఎనిమిది నెలలుగా పూర్తి స్థబ్ధత ఉన్న రంగం కాస్త కోలుకుంటోంది. ఆతిథ్యం రంగంపై మళ్లీ ఆశలు మొదలు కావడంతో ఆయా రంగాల్లో ఉపాధి పొందే యువత సంతోషపడుతోంది. దీనిపై నమ్మకంతో ఉన్న వేల మందికి ఉపాధి దొరుకుతుందని నమ్మకంతో ముందుకెళ్తున్నారు. దాదాపుగా నెలన్నర మాసం అంటే కార్తీకం, మార్గశిరం మాసం వరకు పెళ్లిలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఎనిమిది నెలలుగా ఆగి వివాహ తంతు ఇక వేగంగా సాగనుండటంతో దీని మీద ఆధారపడ్డ అనేక అనుబంధ రంగాలు ఆశతో ఉన్నాయి.

వివాహాల తంతులో మొదటిది వివాహ వేదిక..

సూళ్లూరుపేట పట్టణంలో దాదాపుగా అన్ని మండపాలు సిద్ధమైనట్లు సమాచారం. గూడూరు పట్టణంలోని మండపాలకు అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్వాహకులు పెళ్లిలు సిద్ధపడ్డారు. నాయుడుపేట పట్టణంలో మండపాలు చాలా వరకు బుక్‌ కాగా అరకొరగా మాత్రమే ఏర్పాట్లలో ఉన్నాయి. ఇక వస్త్ర దుకాణాలు చాలా వరకు తెరుచుకోవడంతో వధువు, వరుడు దుస్తులతోపాటు కుటుంబ సభ్యుల వస్త్రాలు కొనుగోళ్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. బంగారు ఆభరాణాల దుకాణాల్లో కాస్త సందడి కన్పిస్తోంది. అటు వివిధ మాధ్యమాల్లో దుకాణాల ప్రచారం పెరిగింది. వ్యాపారులు కూడా దుకాణాల్లో వ్యాపారాలు సాగుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవాయిద్యాలు, పురోహితులు, క్యాటరింగ్, పెళ్లి చిత్రాలు, వీడియో చిత్రీకరణ వంటి దుకాణాల్లో పెళ్లిల సందడి మొదలైంది. పురోహితుల దగ్గర జనం వరుస కడుతున్నారు.
వేదికలు బుక్‌ అవుతున్నాయి
రవివర్మ, పురోహితుడు

ఈనెల 18 నుంచి పెళ్లిల సీజన్‌ ఆరంభం అవుతుంది. దీంతో ఇప్పటి నుంచే బుకింగ్‌ సాగుతున్నాయి. తేదీల వారీగా మంచి రోజులున్న సమయంలో బుకింగ్స్‌ సాగుతున్నాయి. వేదికల దగ్గర వివాహనాలు చేస్తుండటంతో అన్ని రంగాలకు మేలు జరుగుతుంది.

అధికారుల అనుమతులు షురూ
కొందరు పెళ్లి కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు వేదికలు అనుమతుల కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తులు పెట్టుకుని అనుమతులు తీసుకుంటున్నారు. ఇలా సందడి మొదలు కావడంతో ఆయా రంగాల్లో ఉన్న అనేక మందిలో ఆనందం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి. 'సీఎం ధోరణి.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.