ETV Bharat / state

man dies by police harrasment: పోలీసుల వేధింపులు తాళలేక వ్యక్తి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన

man dies by police harrasment: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరంలో.. పోలీసుల వేధింపులు తాళలేకే చెంచయ్య అనే వ్యక్తి మరణింనట్లు అతని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. పోలీస్‌ స్టేషన్ ఎదుట జాతీయరహదారిపై బైఠాయించారు. పేకాట కేసులో చెంచయ్యను పట్టుకున్న పోలీసులు.. మూడు రోజులుగా స్టేషన్‌కు పిలిపించి వేధించారని ఆరోపించారు. ఇవాళ స్టేషన్​కు వెళ్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడని.. కన్నీరుమున్నీరయ్యారు.

man dies by police harrasment in nellore
పోలీసుల వేధింపులు తాళలేక వ్యక్తి మృతి
author img

By

Published : Dec 21, 2021, 9:10 PM IST

man dies by police harrasment: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరంలో.. పోలీసుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి మృతి చెందాడు. చెంచయ్య అనే వ్యక్తితో సహా మరో నలుగురిని పేకాట కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కేసులో భాగంగా.. చెంచయ్యను పోలీసులు రోజూ స్టేషన్​కు పిలిపించి వేధింపులకి గురిచేశారని, మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇవాళ స్టేషన్​కు వెళ్లే ముందు చెంచయ్య కుప్పకూలి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం మృతదేహాన్ని తీసుకుని పీఎస్ ఎదుట న్యాయం ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులకు మద్దతుగా స్థానికులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మర్రిపాడు ఎస్ఐ వెంకటరమణను వెంటనే సస్పెండ్ చేయాలని.. వారు డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామన్న ఉన్నతాధికారుల హామీతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:

YS Viveka Murder Case: వివేకా హత్యకేసు నిందితుల బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.