కరోనా వైరస్ నియంత్రణకు నెల్లూరు నగరంలో చేపట్టిన లాక్డౌన్ రెండవ రోజుకు చేరింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసరాల కొనుగోలుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఒంటి గంట తర్వాత దుకాణాలు మూతపడగా.. వాహన రాకపోకలు తగ్గిపోయాయి. ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాలను నియంత్రిస్తున్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: 'కరోనా తగ్గేవరకూ మద్యం షాపులు మూసేయండి '