నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానికులు నిరసన చేపట్టారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారంటూ ఆరోపించారు. అర్హులైనవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ తహసీల్దార్ లక్ష్మీ ప్రసన్నకు వినతిపత్రం అందజేశారు. స్థానిక వీఆర్వో సరిగా విచారణ చేయకుండా తమకు ఇళ్ల స్థలాలు రాకుండా చేశారని మండిపడ్డారు. పరిశీలించి రీ సర్వే చేస్తామని తహసీల్దార్ వారికి హామీ ఇవ్వడం ప్రజలు వెనుదిరిగారు.
ఇవీ చూడండి... : ఆర్టీసీ కార్మికుల నిరసన... జాగ్రత్తలు తీసుకోవటం లేదని ఆవేదన