పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. మరణించిన వారి అంతిమ సంస్కారాలకు ఆరడుగుల స్థలం అవసరం. ఆ స్థలం ఉన్నా కూడా.. అక్కడికి వెళ్లేందుకు మార్గం సరిగా లేకుంటే.. చనిపోయిన వారి కుటుంబీకుల ఆవేదన రెట్టింపు కావడం ఖాయం. నెల్లూరు జిల్లా బాలయపల్లి మండలం కడగుంట గ్రామస్తులది ప్రస్తుతం ఇదే పరిస్థితి.
గ్రామంలో గురువారం ఓ వివాహిత మృతి చెందింది. దహన సంస్కారాల నిమిత్తం శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు కుటుంబీకులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో ఉన్న శ్మశాన స్థలం దారి ఆక్రమణకు గురైంది. అందులోనూ ఇప్పుడు వర్షాలు. దారులు లేక పొలాల మధ్యలో పాడెను మోసుకెళ్తూ... గ్రామస్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలుమార్లు రెవిన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: