ETV Bharat / state

ఏడాది పాలనలో సాధించిందేమీ లేదు: శ్రీనివాసులురెడ్డి - ttdp lands sale issue update

వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. అరాచక పాలనతోనే ఏడాది ముగిసిందని నెల్లూరులో ధ్వజమెత్తారు.

శ్రీనివాసులురెడ్డి
శ్రీనివాసులురెడ్డి
author img

By

Published : May 24, 2020, 7:20 PM IST

వైకాపా నేతలు ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. చివరకు సోమశిల జలాలను సైతం అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. ఉన్నత న్యాయస్థానాల తీర్పులను లెక్క చేయకుండా పాలన సాగించడం దారుణమని వ్యాఖ్యానించారు.

తితిదే ఆస్తులను అమ్మేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. ప్రజలపై భారం మోపేలా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.