కండలేరు జలాశయం నిర్మించి 40 సంవత్సరాలు పూర్తి కావస్తున్నదని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ హరినాథరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కండలేరు జలాశయంలో 50 టీఎంసీల నీరు నింపామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం ఆదేశాలతో 60 టీఎంసీల నీరు చేర్చామని చెప్పారు.
2010లో 52 టీఎంసీలు మాత్రమే నింపామని.. ఇప్పుడు 60 టీఎంసీల నీరు చేరడంతో కండలేరు జలాశయం ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ రబీ సీజన్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వివరించారు. అంతేకాకుండా వచ్చే ఖరీఫ్ సీజన్లోనూ నీరు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చిత్తూరు నుంచి చెన్నై ప్రజలకు తాగు నీరు సమృద్ధిగా అందిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: