నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 50,708 మంది నమూనాలను కరోనా పరీక్షలకోసం సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 372 కరోనా కేసులు నమోదయ్యాయని, ఐదుగురు మృతి చెందారని తెలిపారు. 241మంది ఆసుపత్రి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. బయటికి వెళ్తున్నప్పుడు శానిటైజర్ వాడాలని.. జాగ్రత్తలు వహించి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి. వైకాపా ప్రభుత్వ టెర్రరిజం పరాకాష్టకు చేరింది: చంద్రబాబు