నెల్లూరు జిల్లా ఆత్మకూరు అభివృద్ధి సాధనకై, నియోజకవర్గ రైతాంగ సమస్యల పరిష్కార సాధనకై, జనసేన నేత ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ చేస్తున్న ఈ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. టోనీ బాబు, చెరుకూరి సుబ్బు, రాము కాటూరి, షేక్ షాన్వాజ్, అన్నవరం శ్రీనివాసులు, పవన్ కుమార్, గౌతమ్, జమ్మల ప్రసాద్ తదితరులు మద్దతునిచ్చారు.
ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలైన చుక్కల భూములు, సోమశిల జలాశయం నీటితో అన్ని చెరువులకు సాగునీరు అందించే ప్రణాళికను రూపొందించడం, ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకం, సంగం బ్యారేజీని పూర్తిచేయడం, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. ఆత్మకూరు పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికను రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: