ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళల నుంచి బంగారు ఆభరణాలు దోచుకెళ్లే అంతర్రాష్ట్ర దొంగను... నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తమిళనాడు వాసిగా గుర్తించారు. ఇతను సూళ్లూరుపేట, నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ... ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇప్పటివరకూ 11 దొంగతనాలు చేశాడని పోలీసులు తెలిపారు. అతని నుంచి బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. వాటివిలువ సుమారు రూ.8 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
ఇవీ చదవండి..