ETV Bharat / state

వైసీపీ నేతలు రూ.3 వేల కోట్ల సిలికా దోపిడీకి పాల్పడ్డారు: సోమిరెడ్డి - TDP leader Somireddy latest comments

TDP leader Somireddy latest comments: నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు రూ.3 వేల కోట్ల సిలికా దోపిడీకి పాల్పడ్డారని.. తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి ఆరోపించారు. గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులున్నా.. వారిని బెదిరించి వసూలు చేశారని ధ్వజమెత్తారు. ఈ దోపిడీలో ప్రభుత్వ పెద్దలకూ భాగస్వామ్యం ఉందంటూ పలు కీలక విషయాలను మీడియా ముందు ఆయన వెల్లడించారు.

Somireddy
Somireddy
author img

By

Published : Apr 4, 2023, 3:21 PM IST

సిలికా దోపిడీ..ఓబుళాపురం స్కాంను తలపిస్తోంది..

TDP leader Somireddy latest comments: నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు రూ.3 వేల కోట్ల సిలికా దోపిడీకి పాల్పడ్డారని.. తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆరోపించారు. గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులున్నా.. వారిని బెదిరించి వసూళ్లు చేశారని ధ్వజమెత్తారు. ఈ దోపిడీలో ప్రభుత్వ పెద్దలకూ భాగస్వామ్యం ఉందంటూ పలు కీలక విషయాలను మీడియా ముందు వెల్లడించారు.

ఓబుళాపురం స్కాంను తలపిస్తుంది: ఈ కుంభకోణంపై నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలికా శాండ్‌కు సంబంధించి రూ.3 వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి ఆరోపించారు. మరో ఓబుళాపురం స్కాంను తలపించేలా ఈ కుంభకోణం ఉందని ఆయన ధ్వజమెత్తారు. వేలాది కోట్ల రూపాయల లావాదేవీలపై జీఎస్టీ ఎగవేతపైనా సీబీఐ విచారణ జరపాలని.. సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి డిమాండ్‌ చేశారు.

కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తాం: సిలికా దోపిడీకి సంబంధించిన అంశంపై త్వరలోనే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సోమిరెడ్డి వెల్లడించారు. ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 78మంది లింకుదారులకు 300కోట్ల రూపాయల పెనాల్టీ వేసి, వారంతా తమకే సిలికా శాండ్‌ ఇచ్చేలా మైనింగ్‌ మాఫియా మెడపై కత్తిపెట్టిందని మండిపడ్డారు. మైనింగ్‌ మాఫింగ్‌ వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత విజయ సాయి రెడ్డి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లాలో పర్మిట్లు తీసుకుని నెల్లూరు జిల్లాలో తవ్వకాలు జరుపుతున్నారని సోమిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

టన్నుకు రూ.700 మాత్రమే జీఎస్టీ కడుతున్నారు: కర్నూలు జిల్లాలో సిలికా శాండ్ నాణ్యత ఉండదని.. అందుకని కర్నూలు జిల్లాలో అనుమతులు తెచ్చుకుని.. నెల్లూరులో తవ్వుతున్నారని ఆరోపించారు. టన్ను సిలికా శాండ్‌ 1,485కు అమ్ముకుంటూ జీఎస్టీ మాత్రం 700 రూపాయలకే కడుతున్నారని విమర్శించారు. దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. వైసీపీలో చేరిన నెల్లూరు మేయర్ భర్త అతి పెద్ద లీజుదారుడన్న సోమిరెడ్డి.. అతనికి 120 కోట్ల మేర పెనాల్టీలు వేశారన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడు మీద పెనాల్టీలు వేస్తున్నారని వెల్లడించారు. అక్రమాలకు సహకరించని అధికారులను గంటలో బదిలీ చేసేస్తున్నారని ఆక్షేపించారు. మొత్తం వ్యవహారంపై ఎన్జీటీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయపరంగానూ పోరాడతామని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాలో 78 మందికి లీజులు ఉన్నాయి. వాళ్లకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చాలా తక్కువ జీఎస్టీ వేశాము. ఇప్పుడు అవన్నీ కూడా పెంచేశారు. మొత్తం ఈ మూడు సంవత్సరాల్లో 3000 ఎకరాల్లో 78మంది మైళ్లను వైసీపీ అధికారంలోకి రాగానే.. మెడ మీద కత్తి పెట్టి 3 కోట్ల చిల్లర పెనాల్టీ వేసి, దోపిడికి పాల్పడుతున్నారు.-సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, టీడీపీ నేత

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.