నెల్లూరు జిల్లా కోవూరు, కావలి నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో విలువైన గ్రావెల్ ఉంది. పదేళ్లుగా ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే భారీగా తవ్వకాలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నెల్లూరు నుంచి కావలి వరకు జాతీయ రహదారి పక్కనే ఇష్టానుసారం తవ్వేశారు. పశువులకు మేత దొరకని పరిస్థితి. వర్షాలు వస్తే పశువులు గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి.
స్థిరాస్తి వ్యాపారం పుంజుకొని గ్రావెల్‌కు ధర పెరిగింది. ప్లాట్లు విక్రయించేందుకు గ్రావెల్ తెచ్చి చదును చేసుకుంటున్నారు. ఒక డంపర్‌కు 7 యూనిట్లు గ్రావెల్ నింపి 15వేల రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. పదేళ్లుగా ప్రభుత్వ భూములన్నీ తవ్వేశారు. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. గ్రావెల్ ఎక్కువలోతు తవ్వకూడదని చట్టం చెబుతున్నా... ఎవరూ పట్టించుకోవడం లేదు. గనుల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు.
'ఛైర్‌పర్సన్ పదవి కోసం ఎమ్మెల్యేకు రూ. 2.5 కోట్లు ముట్టజెప్పా'