ETV Bharat / state

కోర్టుల నుంచి ఆధారాలు చోరీ అయితే విచారణ ఎలా? - కోర్టులో చోరీ జరిగితే విచారణ ఎలా

ఏదైనా ఒక కేసులో దస్త్రాలు, ఆధారాలు, నేర నిరూపణలో కీలకమైన వస్తువులు కోర్టు నుంచి దొంగతనానికి గురైనా, లేదా అవి కనిపించకుండా పోయినా ఆ కేసు పరిస్థితి ఏంటి? విచారణ ఎలా ముందుకు సాగుతుంది? మళ్లీ ఆ ఆధారాలన్నింటినీ సమకూర్చుకోవడం సాధ్యమేనా? వాటి ఆధారంగా న్యాయస్థానాలు విచారణ చేపడతాయా? నేరం నిరూపణ అయితే వాటి ఆధారంగా శిక్షలు వేస్తాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి. వీటిపై న్యాయవాదులు, నిపుణులు, విశ్రాంత పోలీసు అధికారులు తమ అభిప్రాయాలను తెలిపారు.

court theft
court theft
author img

By

Published : Apr 25, 2022, 4:08 AM IST

వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులోని దస్త్రాలు, కీలక ఆధారాలు నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురైన ఘటన చర్చకు దారితీసింది. ఇలా ఏదైనా ఒక కేసులో దస్త్రాలు, ఆధారాలు, నేర నిరూపణలో కీలకమైన వస్తువులు కోర్టు నుంచి దొంగతనానికి గురైనా, లేదా అవి కనిపించకుండా పోయినా ఆ కేసు పరిస్థితి ఏంటి? విచారణ ఎలా ముందుకు సాగుతుంది? మళ్లీ ఆ ఆధారాలన్నింటినీ సమకూర్చుకోవడం సాధ్యమేనా? వాటి ఆధారంగా న్యాయస్థానాలు విచారణ చేపడతాయా? నేరం నిరూపణ అయితే వాటి ఆధారంగా శిక్షలు వేస్తాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి. దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని న్యాయస్థానాల్లో పటిష్ఠ భద్రత, దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను తెలుపుతోంది. కోర్టుల నుంచి చోరీకి గురైన, లేదా కనిపించకుండా పోయిన దస్త్రాలు, ఆధారాల్ని తిరిగి సమకూర్చుకునే అవకాశాలు ఉన్నా.. అది కొంత క్లిష్టమైన ప్రక్రియ అని, అందుకు చాలా సమయం పడుతుందని న్యాయవాదులు, నిపుణులు, విశ్రాంత పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఆధారాల్ని తిరిగి ఎలా సమకూర్చుకుంటారు?

ఏదైనా ఒక కేసులో అభియోగపత్రం దాఖలు చేసినప్పుడు దర్యాప్తు అధికారులు దానికి సంబంధించిన అన్ని పత్రాలు, దస్త్రాలు, ఆధారాలు, వివిధ వస్తువులు (మెటీరియల్‌ ఆబ్జెక్ట్స్‌) అన్నింటినీ న్యాయస్థానానికి సమర్పిస్తారు. వీటిల్లో పత్రాలు, దస్త్రాలు, కాగితాలు పోయినా వాటిని తిరిగి సమకూర్చుకోవచ్చు. వాటి నకలు ప్రతులు దర్యాప్తు అధికారులతో పాటు, ఆ కేసు వాదించే న్యాయవాదుల వద్ద అందుబాటులో ఉంటాయి. న్యాయస్థానం ‘రీ కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ కోసం ఆదేశాలు జారీచేసి.. వాటిని తిరిగి సమకూర్చుకోవచ్చు.

* ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, కంప్యూటర్లను మెటీరియల్‌ ఆబ్జెక్ట్స్‌గా పరిగణిస్తారు. ఇవి కోర్టులో చోరీకి గురైనా లేదా కనిపించకుండా పోయినా వాటిని తిరిగి పొందలేము. దర్యాప్తు అధికారులు ముందే వాటి నుంచి నేర నిరూపణకు కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తీసుకోవడం, ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల్లో వాటిని విశ్లేషించటం, సాంకేతిక నిపుణులతో పరిశీలన చేయించి వారి అభిప్రాయాలను తీసుకోవటం చేస్తే.. ఆ సమాచారానికి సంబంధించిన సర్టిఫైడ్‌ ప్రతుల్ని తిరిగి పొందొచ్చు. న్యాయస్థానాలు వాటిని ఆధారాలుగా పరిగణనలోకి తీసుకుంటాయి.

* శాస్త్రీయ ఆధారాల్ని ఆయా సంస్థల నుంచి తిరిగి పొందేందుకు వీలుంటుంది.

* కోర్టులో నుంచి చోరీకి గురైన, లేదా కనిపించకుండా పోయిన ఆధారాల్ని, పత్రాల్ని తిరిగి రాబట్టలేకపోతే... ఆ పరిస్థితి ఎందుకు తలెత్తిందో న్యాయస్థానం రికార్డు చేసుకుంటుంది. మిగతా ఆధారాల్ని బట్టి విచారణ ముందుకు తీసుకెళ్తుంది.

దుర్భేద్యమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలి..

నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటన లాంటివి గతంలో ఎక్కడా లేవని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ ఘటనను పాఠంగా తీసుకోవాలి. విచారణలో ఉన్న కేసుల్లోని ఆధారాలు, పత్రాలు, మెటీరియల్‌ ఆబ్జెక్ట్స్‌ను కోర్టుల్లో భద్రపరిచేందుకు వీలుగా.. బ్యాంకుల్లో ఉపయోగించే చెస్ట్‌లు, లాకర్ల లాంటివాటిని కోర్టుల్లోనూ ఏర్పాటుచేయాలి. పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచినట్లుగా.. కోర్టుల్లోనూ స్ట్రాంగ్‌రూమ్‌ తరహా ఏర్పాట్లు చేసి వాటిల్లో ఈ ఆధారాల్ని, పత్రాల్ని ఉంచితే మేలు. వాటికి రెండంచెల పోలీసు భద్రత ఏర్పాటుచేయాలి. అక్కడ కదలికలను గమనించేందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే హెచ్చరించేలా అలారం ఏర్పాటు చేసుకోవాలి.

విచారణను జాప్యం చేయించే ఎత్తుగడ

న్యాయస్థానం సంరక్షణలో ఉన్న దస్త్రాలు, ఆధారాలు, ఇతర వస్తువుల్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చోరీ చేయించినంత మాత్రాన, అవి కనిపించకుండా చేసినంత మాత్రాన నిందితులు తప్పించుకోలేరని కొందరు న్యాయవాదులు, నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఒక కేసులో నేర నిరూపణకు ఉపయోగపడేలా స్పష్టమైన ఆధారాలున్నాయని, విచారణ పూర్తయితే తమకు శిక్ష పడే ప్రమాదం ఉందని ఆ కేసులోని నిందితులు భావించినప్పుడు వారిలో కొందరు వాటిని కనిపించకుండా చేయించటం లేదా చోరీ చేయించటం వంటివి చేసే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. విచారణ జాప్యం చేయించాలనే ఎత్తుగడతో ఇలాంటి నేరపూరిత చర్యలకు తెగబడే వీలుందని చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని అలాంటి ఘటన వెనుక ఆ కేసులోని నిందితుల పాత్ర ఉందా? అనేదానిపై విచారణ చేపట్టి ఆధారాల్ని మాయం చేసినందుకు కఠినంగా శిక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.

దస్త్రాలు డిజిటైజ్‌ చేయాలి... భద్రత వసతులు పెంచాలి

న్యాయస్థానాల్లో దావాలు వేసినప్పుడు ఓపెన్‌ బాక్సుల్లోనే ఫైల్‌ చేస్తాం. అవి ఎక్కడికీ పోవనే నమ్మకంతో వేస్తాం. నెల్లూరు కోర్టులో చోరీ ఘటన నేపథ్యంలో అలా వేయటానికీ ఆలోచించాల్సిన పరిస్థితి. కేసులకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు, మెటీరియల్‌ ఆబ్జెక్ట్స్‌ను భద్రపరచటానికి న్యాయస్థానాల్లో తగిన మౌలిక వసతులు లేవు. కోర్టు గుమాస్తాలే ట్రంకుపెట్టెల్లో, బీరువాల్లో వాటిని భద్రపరచాల్సిన పరిస్థితి ఉంది. అలాంటివి భద్రపరచడానికి న్యాయస్థానాల్లో ప్రత్యేకంగా మౌలిక వసతులు కల్పించాలి. వాటికి పటిష్ఠ భద్రత ఏర్పాటుచేయాలి. సీసీ కెమెరాల నిఘాలో ఉంచాలి. దస్త్రాలన్నింటినీ డిజిటైజ్‌ చేయాలి. కేసులో పత్రాలు, దస్త్రాలు, ఆధారాల్ని కనిపించకుండా చేసినా, చోరీ చేయించినా ఫలితం ఉండదని, అవన్నీ మరోచోట వెంటనే పొందే అవకాశాలు ఉంటాయని తేలితే ఎవరూ అలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉండదు. -సుంకర రాజేంద్రప్రసాద్‌, సీనియర్‌ న్యాయవాది

ప్రయోజనం ఎవరికనే కోణంలో దర్యాప్తు చేయాలి

ఏదైనా ఒక కేసులో ఆధారాలు, పత్రాలు న్యాయస్థానం నుంచి చోరీకి గురైనప్పుడు లేదా కనిపించకుండా పోయినప్పుడు తొలుత అది ఉద్దేశపూర్వకమేనా? అనేది తేల్చాలి. అలా చేయటం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే కోణంలో దర్యాప్తు చేయాలి. వారి పాత్ర తేలితే ఆధారాల ధ్వంసం కింద చర్యలు చేపట్టాలి. బెయిల్‌ రద్దుచేయాలి. కోర్టుల నుంచి ఆధారాల్ని చోరీ చేసినంత మాత్రాన నిందితులు తప్పించుకోలేరు. పత్రాలు పోతే వాటిని వివిధ రూపాల్లో సమకూర్చుకోవచ్చు. వాటిని తిరిగి సమకూర్చుకోవటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ మేరకు విచారణ జాప్యం చేయించొచ్చనే ఎత్తుగడ దీనిలో ఉండొచ్చు. ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే.. ఈ తరహా ఘటనలు పునరావృతం కావు. - పోసాని వెంకటేశ్వర్లు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది

ఇదీ చదవండి: Nellore Court Theft Case: చోరీకి కారకులు ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.