నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతసాగరం మండలంలోని కొమ్మలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు సమీప గ్రామాలకు వెళ్లేందుకు బ్రిడ్జి లేకపోవటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వాగులో పూడిక తీయించడంలేదని రైతులు ఆరోపించారు. సుమారు 100ఎకరాలకుపైగా నారుమళ్లు నీటమునిగాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: నెల్లూరు జిల్లాలో భారీ వర్షం... స్వర్ణముఖి నదికి జల కళ