ETV Bharat / state

ఆలస్యంగా 108 వాహనం.. విధి నిర్వహణలో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి - విధి నిర్వహణలో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

HEAD CONSTABLE DIED IN DUTY : నెల్లూరు జిల్లాలో విధి నిర్వహణలో ఓ హెడ్​కానిస్టేబుల్​ మృతి చెందారు. హెలీపాడ్‌వద్ద ఉన్న బారికేడ్లను తొలగించేందుకు బుధవారం ఉదయం వెళ్లిన ఆయన దాహంగా ఉందంటూ ఎదురుగా ఉన్న దుకాణం వద్ద నీరు తాగారు. అక్కడే కుర్చీలో కూర్చున్న కొద్దిసేపటికే ముందుకు పడిపోయారు.

POLICE CONSTABLE DIED IN DUTY
POLICE CONSTABLE DIED IN DUTY
author img

By

Published : Sep 8, 2022, 2:42 PM IST

HEAD CONSTABLE DIED : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పోలీసుస్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ పి.చెంచయ్య విధి నిర్వహణలో బుధవారం ప్రాణాలు కోల్పోయారు. సంగంలో మంగళవారం జరిగిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా విరామం లేకుండా విధులకు హాజరవుతున్నారు. హెలీపాడ్‌ వద్ద ఉన్న బారికేడ్లను తొలగించేందుకు బుధవారం ఉదయం వెళ్లిన ఆయన దాహంగా ఉందంటూ ఎదురుగా ఉన్న దుకాణం వద్ద నీరు తాగారు. అక్కడే కుర్చీలో కూర్చున్న కొద్దిసేపటికే ముందుకు పడిపోయారు. దీంతో స్థానికులు, పోలీసు సిబ్బంది సంగంలోని పీహెచ్‌సీకి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు నెల్లూరుకు తరలించాలని ఎస్సై కె.నాగార్జునరెడ్డి ప్రయత్నించినా.. 108 వాహనం చాలాసేపటి వరకు అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత రావడంతో తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందారు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగే చెంచయ్య మృతి చెందారన్న సమాచారంతో పోలీసు సిబ్బందితోపాటు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చెంచయ్య కావలి పట్టణానికి చెందిన వారైనా.. నెల్లూరులో స్థిరపడ్డారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.