ETV Bharat / state

పరిశ్రమల ఏర్పాటుకు.. నిమ్మ, అరటి, బొప్పాయి రైతుల అభ్యర్థన - నెల్లూరు జిల్లాలో హార్టికల్చర్ రైతుల కష్టాలు

కాయకష్టం చేసి పండించిన పంట కన్నీటి పాలైంది.. ఆరుగాలం శ్రమించి సాధించిన దిగుబడి మట్టిలో కలిసింది.. కరోనా, లాక్‌డౌన్‌తో మార్కెట్లు మూతపడటం, పొరుగు రాష్ట్రాలకు సరకు తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడం.. వెరసి సింహపురి ఉద్యాన రైతులకు నష్టమే మిగిలింది. ఈ స్థితిలో ఉద్యాన అనుబంధ పరిశ్రమలు జిల్లాలో విరివిగా ఏర్పాటు చేస్తేనే మనగలుగుతామని, ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలంటూ అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.

harticulture farmers problems in nellore district
పరిశ్రమల ఏర్పాటుకు నిమ్మ, అరటి, బొప్పాయి రైతుల అభ్యర్థన
author img

By

Published : Jul 20, 2020, 7:45 PM IST

నెల్లూరు జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాల తర్వాత ఉద్యాన పంటలదే పైచేయి. జిల్లాలో ఈ ఏడాదీ దాదాపు 50 వేల హెక్టార్లలో నిమ్మ, అరటి, జామ, బొప్పాయి, చీనీ, మామిడి, తదితర రకాలు సాగవుతున్నాయి. ఇందులో నిమ్మ సాగుదే అగ్రస్థానంగా చెప్పొచ్చు. దాదాపు లక్ష ఎకరాల్లో నిమ్మ సాగు ఉండగా.. పొదలకూరు, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో ఈ తోటలు విరివిగా విస్తరించి ఉన్నాయి. ఆ తర్వాత ప్రాధాన్యం అరటిది కాగా.. బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కొడవలూరు, సంగం, తదితర మండలాల్లో సాగవుతోంది.

ఎంతో ఉపయోగం

నిమ్మ అనుబంధంగా జ్యూస్‌ తయారీ పరిశ్రమలు జిల్లాకు వస్తే ఎంతో మేలని రైతులు కోరుతున్నారు. గింజలు, తొక్క నుంచి నూనెల ఉత్పత్తి చేసే అవకాశం ఉందని.. ఫార్మా రంగంలోనూ ‘సి’ విటమిన్‌ మాత్రల తయారీలో నిమ్మను వాడుతుండటంతో ఆ తరహా కర్మాగారాల ఏర్పాటు చేయాల్సి ఉంది. అరటి పరంగా నార ఉత్పత్తి, చిప్స్‌, జ్యూస్‌, జామ్‌ రూపొందించే పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది వినతి. ప్రస్తుతం జిల్లాకు చెందిన గౌతంరెడ్డి పరిశ్రమలశాఖ మంత్రిగా బాధ్యతలు చూస్తున్న క్రమంలో ఆయన చొరవ చూపాలని వేడుకుంటున్నారు. గ్రామాల్లో ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసి ఉద్యాన రైతులను సంఘటితం చేయటంతో పాటు శీతల గిడ్డంగులను ఏర్పాటు చేసి రైతులకు ఊతమివ్వాలని కోరుతున్నారు.

ఊరగాయలు, పచ్చళ్ల తయారీ మేలు

నిమ్మకాయల దిగుబడికి సీజన్‌ అనేది లేదు. నిమ్మ మార్కెట్లకు అనుగుణంగా ప్రభుత్వం ఊరగాయలు, పచ్చళ్ల పరిశ్రమలు స్థాపించాలి. గ్రామాల్లో రైతు సంఘాలను ఏర్పాటు చేసి తద్వారా పొరుగు రాష్ట్రాలకు సరకు తీసుకెళ్లి అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి. -- రాంబాబునాయుడు, నిమ్మరైతు, బాలాయపల్లి

పరిశ్రమలు పెట్టాలి

మాకు అరటి దిగుబడులు బాగున్నా మార్కెట్లో ధరలు లేనప్పుడు, మూతపడినప్పుడు కష్టమంతా వృథా అవుతోంది. అరటి అనుబంధ పరిశ్రమలు, శీతల గోదాములను అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుంది. -- శ్యాంబాబు, కాలయ కాగొల్లు, బుచ్చిరెడ్డిపాళెం మండలం

పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేం

నాకు ఐదెకరాల నిమ్మతోట ఉంది. గతేడాది రూ.5 లక్షల మేర ఆదాయం వచ్చింది. ఈసారి రూ.70 వేలు రావడం కూడా గగనంగా మారింది. పొరుగు రాష్ట్రాలకు తీసుకెళదామనుకున్నా అక్కడ మార్కెట్లు లేవు. ఇక్కడ పరిశ్రమలు ఉంటే మా కష్టం మట్టి పాలయ్యేది కాదు. -- కృష్ణయ్య, పొదలకూరు

నిమ్మలో ఏటా రూ.17 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఆ సాగు వదలడానికి మనసొప్పేది కాదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. కరోనా కారణంగా మార్కెట్లు మూత పడటంతో కష్టాలు పడుతున్నాం. ఈ స్థితిలో అనుబంధ పరిశ్రమలు మా ప్రాంతంలో ఏర్పాటై ఉంటే మేం నష్టపోయేవాళ్లం కాదు. ఈ స్థితిలో నిమ్మ అనుబంధ ఉత్పత్తుల కర్మాగారాలు విరివిగా ఏర్పాటైతే మేం మనగలుగుతాం.’’ - బాబిరెడ్డి, ఆల్తుర్తి, పొదలకూరు మండలం

'నిమ్మ దిగుబడులు ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఆ స్థాయిలో మార్కెటింగ్‌ సౌకర్యం లేదు. ప్రస్తుతమున్న మార్కెట్లు మూతపడితే అంతే సంగతి. చెట్లలోనే కాయలు వదిలేయాల్సి వస్తోంది. ఒకవేళ కోసినా అమ్ముకోలేక కూలీ ఖర్చులూ రావడం లేదు. ఇక్కడ లెమన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు స్థాపిస్తే మాకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఔషధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మాలాంటి రైతులకు నష్టం ఉండదు.’’ - రవీంద్రరెడ్డి, నిమ్మరైతు, పల్లిపాడు, బాలాయపల్లి మండలం

--

ఇవీ చదవండి:

లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా.. విశాఖలో మూలాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.