ETV Bharat / state

Harassment మా కార్యాలయ బాత్​రూంకు వైసీపీ నేత తాళం వేశారు.. దళిత మహిళా ప్రజాప్రతినిధుల ఫిర్యాదు - దళిత మహిళా ప్రజా ప్రతినిధులను వేధిస్తున్న వైసీపీ

Harassment of women MPP: తమకు ఇబ్బందిగా ఉంటే.. ప్రత్యర్ధి ఎవరైనా, ఎలాంటి సమస్య అయినా అధికార పార్టీనేతలు లెక్కచేయడం లేదనే ఆరోపణలు నెల్లూరు జిల్లాలో వినిపిస్తున్నాయి. జిల్లాలోని రాపూరు ప్రజాప్రతినిధుల కార్యాలయం బాత్​రూంకి వైసీపీనేత తాళం వేయడం.. విమర్శలకు దారి తీసింది. దళిత మహిళలం అనే చిన్నచూపుతోనే తమ కార్యాలయానికి తాళం వేశారని.. వారు మంత్రి కాకాని దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 22, 2023, 8:19 PM IST

Harassment of women : నెల్లూరు జిల్లా రాపూరు మండల ఎంపీపీ కుమ్మరగుంట ప్రసన్న, జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్నలను దళిత మహిళలమని తమను వైసీపీ నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై రెండురోజుల కిందట జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చామని వెల్లడించారు. తమ సమస్యను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి, జెడ్పీ చైర్ పర్సన్ క దృష్టికి తీసుకెళ్లారు. తమ కార్యాలయ వాష్​రూంకు తాళం వేయడం..తమను ఇబ్బందులకు గురిచేయడమేనని వారు మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో తమ ఆవేదనను వెల్లడించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

అసలు ఏమైందంటే.. రాపూరు మండల ఎంపీపీగా ఉన్న చిన్న బాలకృష్ణా రెడ్డి ఇటీవల మరణించడంతో.. వైస్ ఎంపీపీగా ఉన్నకుమ్మరగుంట ప్రసన్నని ఈ నెల 11న రాపూరు మండలానికి ఎంపీపీగా ఎన్నుకున్నట్లు వారు చెప్పారు. కాగా మరుసటి రోజు 12వ తేదీన మండల పరిషత్ కార్యాలయానికి రాగా ఆమెకు కేటాయించిన వసతి గృహంలో ఉన్న వాష్ రూమ్ (బాత్ రూమ్) కు తాళాలు వేశారు. తాళాలు వేసి పది రోజులైనా తీయకుండా మహిళలైన తమను దారుణంగా వేధిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇదే విధంగా కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు, సమావేశాల గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న ఆరోపించారు. దళితులమని చులకన భావంతోనే ఇదంతా చేస్తున్నారని తెలిపారు. తమ ఇబ్బందిపై జిల్లా పరిషత్ చైర్​పర్సన్ ఆనం అరుణమ్మకు తమ సమస్యను పరిశీలన చేసి, పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

ఈ తతంగం అంతా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్​చార్జిగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అండదండలతో ఈ జరుగుతోందని వారు ఆరోపించారు. మహిళలను గౌరవించాలని చెబుతూనే, మరోవైపు ఎస్సీ మహిళను అగౌరపరుస్తూ తాళాలు వేయడం అనేది అధికారులను సైతం ఇబ్బందిగా మారింది. తమకున్న హోదాను బట్టి కనీస అవసరాలతో పాటు గౌరవ మర్యాదలు కాపాడటంలో అధికార పార్టీ నేతలు సహకారం అందించాలని వారు కోరుతున్నారు.

ఈ నెల 11న రాపూరు మండల ఎంపీపీగా నన్ను ఎన్నుకన్నారు అనంతరం 12వ తేదీన మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లగా..అక్కడున్న వాష్ రూమ్ (బాత్ రూమ్) కు తాళాలు వేశారు. దీనిపై అక్కడున్న అధికారులని ప్రశ్నించగా ఎవరూ స్పందించలేదు. దీనిపై జిల్లా కలెక్టర్ కి ఆర్జీ పెట్టినా స్పందనలేదు. కేవలం దళిత మహిళలని చులకనా భావంతో ఇదంతా రామ్ కుమార్ రెడ్డి చేయిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి, జిల్లా పరిషత్ చైర్​పర్సన్​కి వినతిపత్రం ఇచ్చాము. - కుమ్మరగుంట ప్రసన్న రాపూరు ఎంపీపీ.

రాపూరు మండల ఎంపీపీగా కుమ్మరగుంట ప్రసన్న ఎన్నుకన్నాము ఆ తర్వాత 12వ తేదీ నుంచి మండల పరిషత్ కార్యాలయంలోని వాష్ రూమ్ (బాత్ రూమ్) కు తాళాలు వేశారు. తాళాలు అడిగినా ఎవరూ స్పందించలేదు. మండలంలో సమావేశాల గురించి మాకు సమాచారం ఇవ్వడంలేదు. దళిత మహిళలని చులకనా భావంతో ఇదంతా చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కి ఆర్జీ పెట్టినా పట్టించుకోలేదు. దీంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి, జిల్లా పరిషత్ చైర్​పర్సన్​కి సమస్య పరిష్కరించమని మొర పెట్టుకున్నాం. ఇదంతా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్​చార్జిగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అండదండలతో ఈ జరుగుతోంది. మాకున్నహోదాను బట్టి కనీస అవసరాలతో పాటు గౌరవ మర్యాదలు ఇవ్వాలని కోరుతున్నాం. - చిగురుపాటి ప్రసన్న జెడ్పీటీసీ

దళిత మహిళా ప్రజా ప్రతినిధులను వేధిస్తున్న వైసీపీ నేతలు

ఇవీ చదవండి:

Ramzan: రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. హాజరైన రాజకీయ నేతలు

Sankalp Siddi: సంకల్పసిద్ధి కుంభకోణం డబ్బుతో.. ఈ భూములనే కొనుగోలు చేశారు

ఎంగేజ్​మెంట్​ శారీలో అనసూయ అదుర్స్​!.. ఫొటోలు చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.