నెల్లూరు నగరంలోని ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పడారుపల్లి శివార్లలోని ఉన్న లాడ్జిలో ఒకే చున్నీకి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను హరీష్, లావణ్య అని... చిచ్చముర మండలం మెట్టు సచివాలయంలో వారు ఉద్యోగులని పోలీసులు గుర్తించారు.
లావణ్య... మెట్టు సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వర్తించగా.. హరీష్ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పని చేశారు. వీరిద్దరూ ప్రేమించుకున్నా.. ఇరువురికీ ఇటీవలే వేరే వారితో వివాహాలు చేసుకున్నారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. మనస్తాపానికి గురై.. ఒకే చున్నీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: