ఇదీ చూడండి:
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళన - genco employees protest on privatization in nellore
ఏపీజెన్కోలో ఆర్టీపీపీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వల్ల వినియోగదారులు ఇంకా నష్టపోతారని... కార్మికులు రోడ్డున పడతారని వాపోయారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదర సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం వద్ద ఉద్యోగులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఏపీ జెన్కోలోని ఆర్టీపీపీ, ఎస్డీఎస్టీసీలను ప్రైవేటీకరణ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి ఇటువంటి ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇచ్చేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.ఏపీజెన్కో, ఎస్పీడీసీలు, ఈపీడీసీలు, ట్రాన్స్కో ప్రభుత్వం కిందే ఉండాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే తీవ్ర ఇబ్బందులు పడతామని ఉద్యోగులు తెలిపారు. నాణ్యమైన బొగ్గు రాకపోవడం వల్లే విద్యుత్ తయారీలో నష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు.
ఇదీ చూడండి:
sample description