నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలో రైతు భరోసా కేంద్రానికి రైతులు తాళం వేశారు. దళారులు మద్దతు ధరకు ధాన్యం కొనకపోయినా.. అధికారులు పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు రైతు భరోసా కేంద్రం ఎందుకని ప్రశ్నిచారు.
ఆర్బీకే అధికారి శ్వేత.. పంచాయతీ కార్యాలయం వద్ద ఉందని తెలుసుకున్న రైతులు అక్కడకు వెళ్లి ఆందోళన చేశారు. ధాన్యానికి 17శాతం తేమ ఉండేలా ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి:
విడాకులకు ముందే మరో పెళ్లి.. భార్య ఆందోళన.. అత్తింటి కుటుంబీకుల దాడి!