నిషేధిత గుట్కాను అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని నెల్లూరులో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నుంచి 7.32 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పూలే బొమ్మ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. బొలెరో వాహనంలో గుట్కాతో నిందితులు పట్టుబడ్డారు. బెంగళూరు నుంచి అక్రమంగా ఈ గుట్కాను తీసుకువచ్చి నెల్లూరులో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి...'ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగిస్తాం'