నెల్లూరులో అయిదు రోజుల పాటు జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మహా కుంభాభిషేక మహోత్సావాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు మహాకుంభాభిషేక జల ప్రోక్షణ.. కన్నుల పండువగా సాగింది. కంచి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి.. జల ప్రోక్షణలో పాల్గొని పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఆలయ గోపురం, విమాన గోపురాలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య పండితులు జల ప్రోక్షణ నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హెలికాప్టర్ ద్వారా ఆలయంపై పూలు చల్లడం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇదీ చదవండి:
పట్టాలు తప్పిన సింహపురి ఎక్స్ప్రెస్ ఇంజన్