రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలమవుతోంది. గూడూరు-మనుబోలు మధ్య ఆదిశంకర కాలేజీ వద్దనున్న జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చెన్నై నుంచి నెల్లూరుకు వస్తున్న వాహనాలు దాదాపు 7 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: నివర్ ఎఫెక్ట్: 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు...వెయ్యి కోట్లకుపైగా నష్టం