శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటను ఆనుకొని ప్రవహించే స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నివర్ తుపాను ప్రభావతంతో భారీ వర్షాలు కురవడం.. నది పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. నాయుడుపేట నుంచి వెంకటగిరికి రాకపోకలు నిలిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
నదికి ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి.. అటుగా ప్రయాణాలు చేయకుండా చర్యలు తీసుకున్నారు. అధికారులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ఎస్సై వెంకటేశ్వరరావు, డీఈ సుధాకర్ పరిశీలించారు.
ఇవీ చూడండి: